Ekta Bhayan: ఏక్తాకు రజతం
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:47 AM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో శనివారం.. భారత అథ్లెట్లు ఏక్తా భయాన్ రజతం, ప్రవీణ్ కుమార్, సోమన్ రాణా కాంస్య పతకాలు సాధించారు. మహిళల ఎఫ్51 క్లబ్ త్రోలో...
ప్రవీణ్‌కు కాంస్యం
ప్రపంచ పారా అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో శనివారం.. భారత అథ్లెట్లు ఏక్తా భయాన్ రజతం, ప్రవీణ్ కుమార్, సోమన్ రాణా కాంస్య పతకాలు సాధించారు. మహిళల ఎఫ్51 క్లబ్ త్రోలో 19.80 మీ. దూరంతో ఏక్తా రజత పతకం దక్కించుకుంది. పురుషుల హైజంప్ టీ64లో ప్రవీణ్ రెండు మీటర్ల దూరంతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ 14.69 మీ.తో కాంస్యం గెలుపొందాడు. ఇప్పటికి భారత్ 6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 18 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం పోటీలకు చివరిరోజు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ