Share News

Akash Deep: నా గురించి ఆందోళన వద్దు..

ABN , Publish Date - Jul 08 , 2025 | 02:57 AM

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఆకాశ్‌ దీప్‌ పది వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు..

Akash Deep: నా గురించి ఆందోళన వద్దు..

  • ఆకాశ్‌దీప్‌ సోదరి జ్యోతి

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఆకాశ్‌ దీప్‌ పది వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన ప్రదర్శనను.. కేన్సర్‌తో బాధపడుతున్న సోదరికి అంకితం ఇస్తున్నట్టు మ్యాచ్‌ అనంతరం ఆకాశ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు అతడి సోదరి జ్యోతి స్పందిస్తూ.. ‘నా సోదరుడి ప్రదర్శనకు గర్విస్తున్నా. ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లే ముందు ఆకాశ్‌ను ఎయిర్‌పోర్టులో కలిశా. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని, దేశం కోసం ఆడాలని సూచించా. ప్రస్తుతం నాకు కేన్సర్‌ మూడో దశలో ఉంది. మరో ఆరు నెలలు చికిత్స తీసుకున్నాక పరిస్థితి ఏమిటనేది చెబుతామని డాక్టర్లు తెలిపారు’ అని వివరించింది. అయితే తనకు కేన్సర్‌ ఉందంటూ ఆకాశ్‌ వెల్లడించిన విషయం తనకు తెలియదని ఆమె పేర్కొంది.

Updated Date - Jul 08 , 2025 | 02:57 AM