Priyanka Fail in World Athletics: సందీప్ ప్రియాంక విఫలం
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:48 AM
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో తొలిరోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. శనివారం జరిగిన 35 కిలో మీటర్ల రేస్‌వాక్‌లో సందీప్ కుమార్, ప్రియాంక గోస్వామి విఫలమయ్యారు....
నేటి భారత్ షెడ్యూల్
మ. 3.10: పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్స్ - సర్వేశ్,
సా. 6: పురుషుల 10వేల మీటర్ల రేసు - గుల్వీర్ సింగ్.
వరల్డ్ అథ్లెటిక్స్
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో తొలిరోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. శనివారం జరిగిన 35 కిలో మీటర్ల రేస్‌వాక్‌లో సందీప్ కుమార్, ప్రియాంక గోస్వామి విఫలమయ్యారు. పురుషుల 35 కిలో మీటర్ల రేస్‌వాక్‌లో సందీప్ కుమార్ 23వ స్థానంలో నిలిచాడు. మహిళల 35 కి.మీ. విభాగంలో ప్రియాంక 24వ స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత రేస్ వాకర్ రాంబాబు డిస్‌క్వాలిఫై అయ్యాడు. పురుషుల విభాగంలో కెనడా, బ్రెజిల్, జపాన్, మహిళల కేటగిరీలో స్పెయిన్, ఇటలీ, ఈక్వెడార్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ 11వ స్థానంలో నిలిచి సెమీస్ చేరడంలో విఫలమైంది. ఇక..మహిళల 100 మీటర్ల స్ర్పింట్‌లో అంతర్జాతీయ స్టార్లు షకారి రిచర్డ్‌సన్, షేరికా జాక్సన్ సెమీ్‌సకు చేరారు. పురుషుల 100 మీ.లలో నొవా లైల్స్, కిషానె థాంప్సన్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి