RCB: ఆర్సీబీ ఆటగాళ్ల బర్త్ డే.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూస్తే నవ్వాగదు..
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:30 PM
చాలా సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది. ఈసారైనా టైటిల్ సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది.
చాలా సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ (IPL 2025) ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది (PBKS Vs RCB). ఈసారైనా టైటిల్ సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. కాగా, ఫైనల్ చేరిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, ఆ జట్టు కోచ్ దినేష్ కార్తీక్ బర్త్ డే ఒకేరోజు. ఆదివారం వీరిద్దరి బర్త్ డే. దీంతో జట్టు సభ్యులు వీరిద్దరి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. కుటుంబ సభ్యులు, జట్టు సహచరుల మధ్య వీరిద్దరూ కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేక్ పూసుకుని సరదాగా గడిపారు. ఆ వీడియోను ఆర్సీబీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
మైదానంలో తోపులాటకు దిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రీడాకారులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి