Unofficial Test: జురెల్ మరో శతకం
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:06 AM
భారత్ ‘ఎ’ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌తో దూసుకెళుతున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో అనధికార టెస్టులో అతను వరుసగా రెండో శతకం (127 నాటౌట్) బాదాడు. దీంతో...
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్ 382/7 డిక్లేర్
బెంగళూరు: భారత్ ‘ఎ’ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌తో దూసుకెళుతున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో అనధికార టెస్టులో అతను వరుసగా రెండో శతకం (127 నాటౌట్) బాదాడు. దీంతో.. ఓవర్‌నైట్ స్కోరు 78/3తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ 382/7 స్కోరు చేసి డిక్లేర్ చేసింది. హర్ష్ దూబే (84), కెప్టెన్ రిషభ్ పంత్ (65) అర్ధసెంచరీలు సాధించారు. మొదట 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. దూబే అవుటయ్యాక తిరిగి క్రీజులోకి వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో అతడి గాయంపై జట్టుకు ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయింది. ఇక, తొలి ఇన్నింగ్స్‌లోనూ జురెల్ అజేయ శతకంతో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 417 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 25/0 స్కోరు చేసింది. ఆటకు ఆదివారమే చివరిరోజు కాగా.. సఫారీలు 392 రన్స్ వెనుకంజలో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 255, సఫారీ జట్టు 221 రన్స్ చేశాయి.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి