భారత్‌ను ఫైనల్ చేర్చిన ధీరజ్
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:43 AM
తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-1లో తన అద్భుత ప్రదర్శనతో భారత రికర్వ్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. స్పెయిన్‌ను 6-2తో ఓడించిన టీమిండియా...

ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-1
ఆబన్‌డేల్ (అమెరికా): తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-1లో తన అద్భుత ప్రదర్శనతో భారత రికర్వ్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. స్పెయిన్‌ను 6-2తో ఓడించిన టీమిండియా పతకం ఖరారు చేసుకుంది. వీసా సమస్యల కారణంగా పోటీల ఆరంభానికి కొద్ది గంటల ముందు మాత్రమే అమెరికా చేరుకున్న ధీరజ్...అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి జట్టును విజయపథంలో నడిపాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు చైనాతో తలపడుతుంది. అంతకుముందు జరిగిన మహిళల రికర్వ్ ఈవెంట్‌లో దీపిక కుమారి, అంకితా భకత్, అనుష్క కుమారి త్రయం 2-6 స్కోరుతో అమెరికా చేతిలో ఓటమిపాలైంది. కాగా కాంపౌండ్ పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే కాంస్యం దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి