Ranji Trophy: ఢిల్లీ 256 స్కోరు 3 వికెట్‌లకు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:18 AM
ఆయుష్ డిసౌజా, సనత్ అజేయ అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. హైదరాబాద్‌తో బుధవారం ఆరంభమైనరంజీ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది....
మిలింద్‌కు రెండు వికెట్లు
హైదరాబాద్‌తో రంజీ
హైదరాబాద్: ఆయుష్ డిసౌజా, సనత్ అజేయ అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. హైదరాబాద్‌తో బుధవారం ఆరంభమైనరంజీ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 256/3 స్కోరు చేసింది. ఆయుష్ (97 బ్యాటింగ్), సనత్ (91 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

భరత్ భారీశతకం.. ఆంధ్ర 289/3
కాన్పూర్: ఓపెనర్ శ్రీకర్ భరత్ (142) సెంచరీతో చెలరేగడంతో.. తాజా రంజీ సీజన్‌ను ఆంధ్ర జట్టు మెరుగ్గా ఆరంభించింది. గ్రూప్-ఎలో బుధవారం ఉత్తరప్రదేశ్‌తో మొదలైన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 289/3 స్కోరు చేసింది. మొదటి రోజు ఆటచివరకు రషీద్ (94 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News