Share News

దంచేసిన ఢిల్లీ

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:14 AM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మూడో విజయాన్ని నమోదు చేసింది. జెస్‌ జొనాసెన్‌ (32 బంతుల్లో 61 నాటౌట్‌) అర్ధ శతకంతోపాటు...

దంచేసిన ఢిల్లీ

విదర్భ X కేరళ

నేటి నుంచి రంజీ ఫైనల్‌

ఉదయం 9.30 నుంచి

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ముంబై X యూపీ

రాత్రి 7.30 నుంచి, స్టార్‌ స్పోర్ట్స్‌లో

  • జొనాసెన్‌ అర్ధ శతకం

  • 6 వికెట్లతో గుజరాత్‌ చిత్తు

బెంగళూరు: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మూడో విజయాన్ని నమోదు చేసింది. జెస్‌ జొనాసెన్‌ (32 బంతుల్లో 61 నాటౌట్‌) అర్ధ శతకంతోపాటు షఫాలీ (27 బంతుల్లో 44) దూకుడుగా ఆడడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరుకే పరిమితమైంది. కాప్‌, సదర్లాండ్‌, శిఖా పాండే తలో 2 వికెట్లు పడగొట్టారు. టాపార్డర్‌ వైఫల్యంతో జట్టు 41/5తో పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో.. డోటిన్‌ (26), భారతి ఫుల్మాలి (40 నాటౌట్‌) ఆదుకున్నారు. తనూజ (16)తో కలసి భారతి ఏడో వికెట్‌కు 51 రన్స్‌ జోడించడంతో జట్టు స్కోరు సెంచరీ దాటింది. ఓపెనర్‌ హర్లీన్‌ డియోల్‌ (5), లిచ్‌ఫీల్డ్‌ (0), బెత్‌ మూనీ (10), కష్వీ గౌతమ్‌ (0), ఆష్లే గార్డ్‌నర్‌ (3), సిమ్రన్‌ నిరాశపరిచారు.


ఛేదనలో ఢిల్లీ 15.1 ఓవర్లలో 4 వికెట్లకు 131 రన్స్‌ చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ, జొనాసెన్‌ రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని గెలుపు బాటలో నిలబెట్టారు. షఫాలీ వెనుదిరిగినా.. తుదికంటా క్రీజులో నిలిచిన జొనాసెన్‌ జట్టును గెలిపించింది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 127/9 (భారతి 40 నాటౌట్‌, డోటిన్‌ 26; కాప్‌ 2/17, సదర్లాండ్‌ 2/20).

ఢిల్లీ: 15.1 ఓవర్లలో 131/4 (జొనాసెన్‌ 61 నాటౌట్‌, షఫాలీ 44; కష్వీ గౌతమ్‌ 2/26).



ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:14 AM