Vijay Hazare Trophy: విరాట్ తగ్గేదేలె
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:43 AM
విజయ్ హజారే వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లో శతకంతో సత్తా చాటిన ఢిల్లీ ఆటగాడు విరా ట్.. రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ (61 బంతుల్లో 77)కి తోడు...
గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
విజయ్ హజారే ట్రోఫీ
బెంగళూరు: విజయ్ హజారే వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లో శతకంతో సత్తా చాటిన ఢిల్లీ ఆటగాడు విరా ట్.. రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ (61 బంతుల్లో 77)కి తోడు కెప్టెన్ రిషభ్ పంత్ (79 బంతుల్లో 70) రాణించడంతో ఢిల్లీ ఏడు వికెట్లతో గెలుపొందింది. మొదట ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ ‘గోల్డెన్ డక్’ అయినా..: ఇక ముంబైకి ఆడుతున్న రోహిత్‌శర్మ ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. హార్దిక్ తమోర్ (93 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో విజృంభించగా, సోదరులు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ చెరో 55 పరుగులతో భళా అనిపించారు. ఛేదనలో యువరాజ్ చౌదరి (96) చెలరేగినా, ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 280/9 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది.
‘రికార్డు’ సగటు
లిస్ట్-ఎ క్రికెట్‌లో కోహ్లీ అత్యధిక సగటు (57.87)ను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ బెవాన్ (57.86) పేరిటనున్న ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాడు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్