ICC Women T20 Rankings: దీప్తి బౌలర్లలో అగ్రస్థానం నెం.1
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:18 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ బౌలర్‌గా నిలిచింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 28 ఏళ్ల దీప్తి.. 737 రేటింగ్ పాయింట్లతో...
టీ20 బౌలర్లలో అగ్రస్థానం
దుబాయ్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ బౌలర్‌గా నిలిచింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 28 ఏళ్ల దీప్తి.. 737 రేటింగ్ పాయింట్లతో బౌలింగ్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా పేసర్ అనబెల్ సదర్లాండ్ (736) రెండో స్థానానికి పడిపోయింది. నెంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవడం దీప్తికి కెరీర్‌లో ఇదే తొలిసారి. మిగతా భారత బౌలర్లలో తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి ఐదు స్థానాలు ఎగబాకి 36వ, శ్రీచరణి ఏకంగా 19 స్థానాలు మెరుగై 69వ ర్యాంకుల్లో ఉన్నారు. టీ20 బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ ఐదు స్థానాలు మెరుగై 9వ ర్యాంక్‌తో టాప్‌టెన్‌లో నిలవగా, స్మృతీ మంధాన మూడో స్థానంలో కొనసాగుతోంది.
జెమీమాకు ‘ఢిల్లీ’ పగ్గాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు కెప్టెన్‌గా 25 ఏళ్ల జెమీమాను ఎంపిక చేసినట్టు ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ఇన్నాళ్లూ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్‌ను గతనెలలో జరిగిన వేలానికి ముందు ఆ జట్టు వదిలేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు