India Womens Hockey: దీపికదే మ్యాజిక్ స్కిల్ అవార్డు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:26 AM
భారత మహిళల హాకీ జట్టు స్ట్రయికర్ దీపిక అంతర్జాతీయ వేదికపై మెరిసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును 21 ఏళ్ల దీపిక...
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు స్ట్రయికర్ దీపిక అంతర్జాతీయ వేదికపై మెరిసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును 21 ఏళ్ల దీపిక గెలుచుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అత్యంత సృజనాత్మకత, నైపుణ్యవంతమైన ప్రదర్శన కనబరచిన ఆటగాళ్లకు మ్యాజిక్ స్కిల్ అవార్డును అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ అభిమానులు ఓటింగ్ ద్వారా అవార్డు విజేతను నిర్ణయిస్తారు. ఈ సీజన్ ప్రొ లీగ్‌లో భాగంగా భువనేశ్వర్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున దీపిక కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్ చేసింది. ఈ ప్రదర్శనే దీపికకు అవార్డు తీసుకొచ్చింది. ఈ అవార్డు నామినేషన్స్‌లో స్పెయిన్ క్రీడాకారిణి పాట్రిసియా, ఆస్ట్రేలియా మహిళల జట్టును అధిగమించి దీపిక విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి