Share News

David Gower Hails Sirajs: సిరాజ్‌ ఏం తింటాడో

ABN , Publish Date - Aug 12 , 2025 | 02:44 AM

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ పూర్తి ఫిట్‌నె్‌సతో బరిలోకి దిగడమే కాకుండా.. వికెట్ల వేటలోనూ అదరగొట్టిన భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ప్రశంసల వర్షం...

David Gower Hails Sirajs: సిరాజ్‌ ఏం తింటాడో

డేవిడ్‌ గోవర్‌ ఆసక్తి

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ పూర్తి ఫిట్‌నె్‌సతో బరిలోకి దిగడమే కాకుండా.. వికెట్ల వేటలోనూ అదరగొట్టిన భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతని ఫిట్‌నెస్‌ అబ్బురపరిచిందని తెలిపాడు. ‘సిరాజ్‌ అసలు ఏం తింటాడు? ఏం తాగుతాడనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే వాటిని ఇంగ్లండ్‌ బౌలర్లకు అందివ్వాలి. సిరీ్‌సలో ఏ టెస్టునూ వదలకుండా అన్నింట్లో బరిలోకి దిగాడు. చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లకు పైగా బౌలింగ్‌ చేసినా అతనిలో అలసటనేదే కనిపించలేదు. గెలిచి తీరాలన్న కసితో పాటు ఫిట్‌నె్‌సలోనూ ఆదర్శంగా నిలిచాడు. మా ఇంగ్లండ్‌ బౌలర్లు మాత్రం కొంతకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నారు’ అని గోవర్‌ వివరించాడు.

ఇవి కూడా చదవండి..

ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2025 | 02:44 AM