Khel Ratna Awards 2025: ఖేల్‌రత్న రేసులో క్రికెటర్లకు మళ్లీ నిరాశే
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:01 AM
వరుసగా రెండో ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో క్రికెటర్లకు చోటు లభించకపోవడం చర్చనీయాంశంగా మారిం ది. బుధవారం జాతీయ ఒలింపిక్ సంఘం..
న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో క్రికెటర్లకు చోటు లభించకపోవడం చర్చనీయాంశంగా మారిం ది. బుధవారం జాతీయ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 24 మందితో కూడిన జాబితాను క్రీడా మంత్రిత్వశాఖకు పంపడం తెలిసిందే. ఒకప్పుడు సచిన్, మిథాలీ, సెహ్వాగ్, విరాట్, హర్మన్‌ప్రీత్ వంటి స్టార్ క్రికెటర్లకు లభించిన ఈ అవార్డులు గత రెండేళ్లుగా ఎవరికీ దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ సాధించగా, మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌క్‌పను దేశానికి అందించినా ఎవరినీ పరిగణనలోకి తీసుకోకపోవడం క్రికెట్ అభిమానులను నిరాశపర్చింది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..