సీనియర్ జట్టుకు వరల్డ్‌కప్ అందించాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:52 AM
భారత సీనియర్ మహిళల జట్టుకు ప్రపంచకప్ అందించడమే తన ఆశయమని అండర్-19 టీ20 వరల్డ్‌కప్ స్టార్, హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ గొంగడి త్రిషా రెడ్డి వెల్లడించింది. మంగళవారం ఏఆర్‌కే ఫౌండేషన్ త్రిషను...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత సీనియర్ మహిళల జట్టుకు ప్రపంచకప్ అందించడమే తన ఆశయమని అండర్-19 టీ20 వరల్డ్‌కప్ స్టార్, హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ గొంగడి త్రిషా రెడ్డి వెల్లడించింది. మంగళవారం ఏఆర్‌కే ఫౌండేషన్ త్రిషను ఘనంగా సత్కరించింది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, టీఎ్‌సపీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏఆర్‌కే గ్రూప్ చైర్మన్ రామిరెడ్డి త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మహిళల సీనియర్ కేటగిరీలో టీమిండియా ఇప్పటివరకు వన్డే, టీ20 వరల్డ్‌క్‌పలను నెగ్గలేదు, ఆ వెలితిని తీర్చి ప్రపంచకప్ అందించడమే తన ఆశయమని త్రిష చెప్పింది. త్రిష వంటి క్రికెటర్లు అరుదుగా లభిస్తారని, ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని గోపీచంద్ ఆకాంక్షించాడు. త్రిషను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి చేరాలని ఎమ్మెస్కే సూచించాడు.
ఇవీ చదవండి:
రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి