CPL Cricketers Robbed: తుపాకీ గురిపెట్టి క్రికెటర్ల దోపిడీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:36 AM
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్, నెవిస్ పాట్రియాట్స్ జట్టు ఆటగాళ్లు దోపిడీకి గురయ్యారు. ఆ క్రికెటర్లు, సీపీఎల్ అధికారి ఒకరు ఓ ప్రయివేట్ ఈవెంట్‌ను ముగించుకొని...
బార్బడోస్: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్, నెవిస్ పాట్రియాట్స్ జట్టు ఆటగాళ్లు దోపిడీకి గురయ్యారు. ఆ క్రికెటర్లు, సీపీఎల్ అధికారి ఒకరు ఓ ప్రయివేట్ ఈవెంట్‌ను ముగించుకొని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హోటల్‌కు వెళుతూ మర్గమధ్యంలో ఆహారంకోసం ఒకచోట ఆగారు. ఆ సమయంలో కొందరు దొంగలు.. క్రికెటర్లు, ఆ అధికారిని తుపాకీతో బెదిరించి నగలు, ఇతర విలువైన వస్తువులు దోచుకొన్నారు. ఈక్రమంలో క్రికెటర్లు దొంగలను ప్రతిఘటించగా వారి మధ్య పెనుగులాట జరిగింది. పెనుగులాటలో దొంగలు ఓ తుపాకీని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనలో క్రికెటర్లు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి