Conway And Latham Century: కాన్వే, లాథమ్ శతకాలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:23 AM
పెనర్లు డెవాన్ కాన్వే (178 బ్యాటింగ్), టామ్ లాథమ్ (137) శతకాలతో చెలరేగడంతో.. వెస్టిండీ్‌సతో గురువారం ఆరంభమైన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా....
న్యూజిలాండ్ 334/1
వెస్టిండీ్‌సతో మూడో టెస్ట్
మౌంట్ మాంగనుయ్: ఓపెనర్లు డెవాన్ కాన్వే (178 బ్యాటింగ్), టామ్ లాథమ్ (137) శతకాలతో చెలరేగడంతో.. వెస్టిండీ్‌సతో గురువారం ఆరంభమైన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న కివీస్ తొలి రోజు ఆట చివరికి వికెట్ నష్టానికి 334 పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ఆఖరికి కాన్వేతోపాటు జాకబ్ డఫీ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లాథమ్, కాన్వే తొలి వికెట్‌కు నెలకొల్పిన 323 పరుగుల భాగస్వామ్యం.. టెస్టుల్లో న్యూజిలాండ్‌కు రెండో అత్యధికం. సెంచరీ సాధించిన లాథమ్‌ను రోచ్ అవుట్ చేశాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్ వివాదం.. స్పందించిన ఐసీసీ