Share News

ఛెత్రి మళ్లీ వస్తున్నాడు!

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:24 AM

భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఏఎఫ్‌సీ ఆసియా క్వాలిఫయర్స్‌లో...

ఛెత్రి మళ్లీ వస్తున్నాడు!

రిటైర్మెంట్‌ వెనక్కి

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఏఎఫ్‌సీ ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఈనెల 25న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా 40 ఏళ్ల ఛెత్రి తిరిగి ఆటలోకి అడుగుపెట్టనున్నట్టు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) గురువారం ప్రకటించింది. ఆ మ్యాచ్‌లో తలపడే 26 మంది సభ్యులతో కూడిన జట్టులో అతడిని కూడా చేర్చింది. ‘కెప్టెన్‌, లీడర్‌, లెజెండ్‌ సునీల్‌ ఛెత్రి మళ్లీ వస్తున్నాడు’ అని ఎక్స్‌లో ఏఐఎఫ్‌ఎఫ్‌ పోస్ట్‌ చేసింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గత ఏడాది జూన్‌లో ఛెత్రి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2025 | 06:24 AM