యూఎస్ ఓపెన్ ‘మిక్స్‌డ్’లో మార్పులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:42 AM
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్రేజ్‌ను పెంచేందుకు నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేయనున్నారు. మెయిన్ డ్రా ఆరంభానికి ఓ వారం ముందే పునర్ వ్యవస్థీకరించిన...
మెయిన్ డ్రాకు ముందే పోటీలు
ప్రైజ్‌మనీ భారీగా పెంపు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్రేజ్‌ను పెంచేందుకు నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేయనున్నారు. మెయిన్ డ్రా ఆరంభానికి ఓ వారం ముందే పునర్ వ్యవస్థీకరించిన ఫార్మాట్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌ను నిర్వహించనున్నారు. అంతేకాకుండా స్టార్ ప్లేయర్లను ఆకర్షించేందుకు ప్రైజ్‌మనీని భారీగా రూ. 8.67 కోట్లకు పెంచారు. యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ డ్రా ఈ ఏడాది ఆగస్టు 24న ఆరంభం కానుంది. అయితే, మిక్స్‌డ్ డబుల్స్‌ను మాత్రం రెండు రోజుల్లో ముగిసే విధంగా ఆగస్టు 19-20 తేదీల్లో షెడ్యూల్ చేశారు. మొత్తం 16 జట్లు మాత్రమే తలపడనున్నాయి. టాప్ ర్యాంక్ ప్లేయర్లు ఆడినా.. ప్రధాన టోర్నీ సమయానికి వారికి తగినంత విశ్రాంతి లభించే విధంగా షెడ్యూల్ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి:
రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి