Share News

SA vs NZ: రాణించిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 363..

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:20 PM

లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీస్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారీగా పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో కదం తొక్కడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది.

SA vs NZ: రాణించిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 363..
Rachin Ravindra

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో భారీ స్కోరు నమోదైంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీస్ పోరులో 360 పైచిలుకు స్కోరు నమోదైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారీగా పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో కదం తొక్కడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. (SA vs NZ).


రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) బౌండరీలతో హోరెత్తించారు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. వీరికి గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్), డారెల్ మిచెల్ (37 బంతుల్లో 49) అద్భుత సహకారాన్ని అందించారు. దీంతో న్యూజిలాండ్ 362 పరుగులు చేసి న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎంగిడి మూడు, రబాడా రెండు వికెట్లు పడగొట్టారు. ముల్దర్ ఒక వికెట్ తీశాడు.


దక్షిణాఫ్రికాకు కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ల స్థాయిలో వారు కూడా రాణిస్తే మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే ఫైనల్‌లో టీమిండియాతో తలపడబోతోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 06:20 PM