Share News

SA vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాతో సెమీస్

ABN , Publish Date - Mar 05 , 2025 | 02:50 PM

లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్‌‌లో టీమిండియాతో తలపడబోతోంది.

SA vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాతో సెమీస్
SA vs NZ

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరో కీలక సెమీస్ మ్యాచ్ ప్రారంభమైంది. లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్‌‌లో టీమిండియాతో తలపడబోతోంది. తిరుగులేని బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్, అదిరే బౌలింగ్‌తో రెండు జట్లూ సమతూకంతో ఉన్నాయి (SA vs NZ).


లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టు రెండు విజయాలు, ఒక ఓటమితో గ్రూప్-ఏలో రెండు స్థానంలో నిలిచింది. ఇక, రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా ఐదు పాయింట్లతో గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున వాండర్ డసెన్, మార్‌క్రమ్, రబాడా, కేశమ్ మహారాజ్ కీలకం కానున్నారు. న్యూజిలాండ్ తరఫున కేన్ విలియమ్సన్, శాంట్నర్, రచిన్, ఫిలిప్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్ సొంతం చేసుకున్నాయి.


తుది జట్లు:

న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్నీ, కేల్ జేమీసన్, విలయమ్ ఓరూర్కీ

దక్షిణాఫ్రికా: రికెల్‌టన్, బవుమా, వాండర్ డసెన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్, ముల్దర్, యాన్సెన్, రబాడా, కేశమ్ మహారాజ్, ఎంగిడి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 02:50 PM