Share News

జట్లన్నీ దుబాయ్‌లోనే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:23 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతుండడం ఇతరజట్లకు సమస్యగా మారింది. అసలు ఆడతామో లేదో తెలియని మ్యాచ్‌కోసం...

జట్లన్నీ దుబాయ్‌లోనే..

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రయాణ కష్టాలు

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతుండడం ఇతరజట్లకు సమస్యగా మారింది. అసలు ఆడతామో లేదో తెలియని మ్యాచ్‌కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు దుబాయ్‌ వెళ్లాల్సివస్తోంది. సెమీ్‌సకు చేరిన జట్ల విషయంలో స్పష్టత వచ్చినా.. ఎవరితో ఎవరు? అనేది ఇంకా తేలాల్సి ఉంది. మార్చి 4న టీమిండియాతో జరిగే సెమీ్‌సలో తలపడే జట్టుకు తగిన ప్రాక్టీస్‌ లభించేందుకు ముందుగానే మిగతా జట్లను కూడా రప్పిస్తున్నట్టు ఐసీసీ అధికారి తెలిపాడు. ఇప్పటికే ఆసీస్‌ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికా లాహోర్‌ నుంచి ఆదివారం రానుంది. ఆదివారం భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఫలితంతో భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. భారత్‌ గెలిస్తే గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌ అవుతుంది కాబట్టి గ్రూప్‌ ‘బి’లో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌ జట్టు దుబాయ్‌లో ఉంటుంది. ఒకవేళ ఓడితే గ్రూప్‌ ‘బి’లో టాప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాతో రోహిత్‌ సేన ఇక్కడ ఆడుతుంది. కివీ్‌సతో రెండో సెమీ్‌సను లాహోర్‌లో ఆడే జట్టేదో ఆదివారం తేలనుంది. ఒకవేళ భారత్‌ ఫైనల్‌కు వస్తే మరో సెమీస్‌ విజేత దుబాయ్‌కి పాకిస్థాన్‌ నుంచి రావాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

ఆఫ్ఘాన్ ఆశలు.. సంచలనం జరగాలి

ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2025 | 03:23 AM