స్మిత్, ఖవాజా శతకాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:52 AM
ఖవాజా (147 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (104 బ్యాటింగ్) అజేయ శతకాలతో అదరగొట్టడంతో శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్ మొదటి రోజే ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో...

శ్రీలంకతో తొలి టెస్ట్
గాలె : ఖవాజా (147 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (104 బ్యాటింగ్) అజేయ శతకాలతో అదరగొట్టడంతో శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్ మొదటి రోజే ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు అభేద్యంగా 195 పరుగులు జోడించారు. దాంతో తొలి రోజు ఆఖరికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 330/2 స్కోరు చేసింది.
10వేల పరుగుల క్లబ్‌లో స్మిత్..: ఈ మ్యాచ్‌కు ముందు 9999 పరుగులతో ఉన్న స్మిత్..ఒక పరుగు తీయడం ద్వారా టెస్టుల్లో 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఈక్రమంలో తన సహచరులు పాంటింగ్, బోర్డర్, స్టీవ్ వా సరసన స్మిత్ చేరాడు. ఓవరాల్‌గా 10 వేల పరుగులు చేసిన 15వ బ్యాటర్‌గా నిలిచాడు. ఇక..35వ శతకం సాధించిన స్మిత్ ఈక్రమంలో 34 సెంచరీలు చేసిన గవాస్కర్, జయవర్దనే, యూనిస్ ఖాన్, లారాను అధిగమించాడు. 205 ఇన్నింగ్స్‌లలో 35వ శతకం సాధించిన స్టీవ్..పాంటింగ్ (194 ఇన్నింగ్స్), సచిన్ (200 ఇన్నింగ్స్) తర్వాత వేగంగా ఈ ఘనత అందుకున్న మూడో బ్యాటర్‌గా మరో రికార్డు సృష్టించాడు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి