Duleep Trophy Final: సెంట్రల్ 511
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:43 AM
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌కు 362 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. యష్ రాథోడ్ (194) తృటిలో డబుల్ సెంచరీ...
యష్ 194
దులీప్ ట్రోఫీ ఫైనల్
బెంగళూరు: సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌కు 362 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. యష్ రాథోడ్ (194) తృటిలో డబుల్ సెంచరీ కోల్పోగా, సారాంశ్ (69) అర్ధసెంచరీ సహాయంతో సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులు సాధించింది. గుర్జ్‌పనీత్, అంకిత్‌లకు నాలుగేసి వికెట్లు లభించాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 129/2 స్కోరుతో నిలిచింది. క్రీజులో స్మరణ్ (37 బ్యాటింగ్), రికీ భుయ్ (26 బ్యాటింగ్) ఉండగా, ఇంకా 233 పరుగులు వెనుకంజలో ఉంది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి