Indias Women World Cup Heroes: కాసుల గలగల వజ్రాల మిలమిల
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:47 AM
దేశ మహిళా క్రికెట్ చరిత్రలో తొలి వన్డే ప్రపంచకప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై కాసుల వర్షం కురుస్తోంది. కప్ గెల్చినందుకు విజేతకు ఐసీసీ అందించే రూ.40 కోట్ల రూపాయలకు తోడు, బీసీసీఐ తమ...
టీమిండియాకు భారీ నజరానాలు
ఇది ఆరంభం మాత్రమే..
ముంబై: దేశ మహిళా క్రికెట్ చరిత్రలో తొలి వన్డే ప్రపంచకప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై కాసుల వర్షం కురుస్తోంది. కప్ గెల్చినందుకు విజేతకు ఐసీసీ అందించే రూ.40 కోట్ల రూపాయలకు తోడు, బీసీసీఐ తమ వంతుగా రూ.51 కోట్లు ప్రకటించింది. జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, వారిని ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీకి కలిపి ఈ నగదు పురస్కారాన్ని అందించనున్నట్టు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఇక, పేసర్ రేణుక సింగ్ ఠాకూర్‌కు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి నగదు బహుమతిని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్‌కు చెందిన మీడియం పేసర్ క్రాంతి గౌడ్‌కు కోటి నగదు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నామని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.
వజ్రాలు పొదిగిన నగలు: టీమిండియా క్రికెటర్లకు వజ్రాలు పొదిగిన నగలతో పాటు వారందరి ఇంటిపైన ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమరుస్తామని సూరత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ధోలాకియా ప్రకటించారు. జట్టు సభ్యులందరిని సన్మానించి, వజ్రాల నగలను బహూకరించే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు గోవింద్ లేఖ రాశారు.
వరల్డ్‌క్‌పలో చాంపియన్‌గా నిలవడంతో అంతా అయిపోలేదు. ఇది మాకు ఆరంభం మాత్రమే. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఇలాంటి విజయాలను అలవాటు చేసుకోవడమే. ప్రస్తుత గెలుపు కోసం దశాబ్దాలుగా ఎదురుచూసి చివరకు సాధించాం. ఇక మున్ముందు మరిన్ని పెద్ద ఈవెంట్స్ రాబోతున్నాయి. అందుకే మేమింకా రాటుదేలాలనుకుంటున్నాం.
హర్మన్‌ప్రీత్ కౌర్
ప్రధానితో సమావేశం రేపు
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. హర్మన్ నేతృత్వంలోని ఆటగాళ్లంతా ఈనెల 5న న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుతం ముంబైలో ఉన్న జట్టంతా మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది.
విక్టరీ పరేడ్ లేనట్టే..
గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచాక భారత పురుషుల జట్టు ముంబైలో విక్టరీ పరేడ్ చేసిన విషయం తెలిసిందే. అదే రీతిన హర్మన్‌ప్రీత్ బృందానికి కూడా విజయోత్సవ ర్యాలీ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చాడు. మంగళవారం నుంచి దుబాయ్‌లో జరిగే ఐసీసీ మీటింగ్‌పైనే ప్రస్తుతం బోర్డు దృష్టి ఉందని, ఆ తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!
Read Latest AP News And Telugu News