Chess Grand Slam: మూడో స్థానం రేస్‌లో కార్ల్‌సన్
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:12 AM
ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించిన వరల్డ్ నెంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ఇప్పుడు మూడోస్థానం కోసం పోటీపడనున్నాడు...
లాస్ వెగాస్: ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించిన వరల్డ్ నెంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ఇప్పుడు మూడోస్థానం కోసం పోటీపడనున్నాడు. లోయర్ బ్రాకెట్ నాకౌట్స్‌లో భారత్‌కు చెందిన అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ గెలిచాడు. మూడో స్థానం కోసం జరిగే పోరులో నకమురాతో కార్ల్‌సన్ తలపడనున్నాడు. టైటిల్ కోసం అరోనియన్‌తో నీమన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా, ఐదో స్థానం కోసం కరువానాతో అర్జున్, ఏడో స్థానం కోసం సో వెస్లీతో ప్రజ్ఞానంద ఆడనున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి