‘అత్యుత్తమ క్రికెటర్’ బుమ్రా
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:41 AM
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును జస్‌ప్రీత్ బుమ్రా సొంతం చేసుకొన్నాడు. గతేడాది మూడు ఫార్మాట్లలోనూ 31 ఏళ్ల బుమ్రా ఆకట్టుకొన్నాడు. ‘2024లో అద్భుత ప్రదర్శనకుగాను పురుషుల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ కింద...
దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును జస్‌ప్రీత్ బుమ్రా సొంతం చేసుకొన్నాడు. గతేడాది మూడు ఫార్మాట్లలోనూ 31 ఏళ్ల బుమ్రా ఆకట్టుకొన్నాడు. ‘2024లో అద్భుత ప్రదర్శనకుగాను పురుషుల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ కింద ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనే కాదు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అతడి ప్రదర్శన అమోఘం’ అని ఐసీసీ కొనియాడింది. రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017, 2018) తర్వాత ఈ అవార్డును అందుకొన్న ఐదో భారత ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. టీమిండియా టీ20 వరల్డ్‌కప్ నెగ్గడంలోనూ జస్‌ప్రీత్ కీలకపాత్ర పోషించాడు. గతేడాది ఆడిన 13 టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. తనకు ఇంతటి గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఓ వీడియో సందేశంలో బుమ్రా పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే.

‘మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కెర్
ఐసీసీ ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఎంపికైంది. ఇప్పటికే ఆమె మహిళల టీ20ల్లోనూ ఉత్తమ ప్లేయర్ అవార్డు దక్కించుకుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో కెర్ విశేషంగా రాణించి 387 పరుగులతో పాటు 29 వికెట్లు తీసింది. అలాగే ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆల్‌రౌండ్ షో (43; 3/24)తో కివీ్‌సకు తొలి టైటిల్ దక్కేలా చేయడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగానూ నిలిచింది.
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
For Telangana News And Telugu News