అందుకే కెప్టెన్సీ వద్దన్నా
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:51 AM
రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో భారత టెస్టు జట్టు పగ్గాలు వైస్‌కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగిస్తారని చాలామంది భావించారు. అయితే సెలెక్టర్లు మాత్రం అనూహ్యంగా..
లండన్: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో భారత టెస్టు జట్టు పగ్గాలు వైస్‌కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగిస్తారని చాలామంది భావించారు. అయితే సెలెక్టర్లు మాత్రం అనూహ్యంగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. దీంతో బుమ్రాను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న చర్చ మొదలైంది. అయితే పనిఒత్తిడిని తగ్గించుకునేందుకే తాను ఆ బాధ్యతలను వద్దన్నట్టు బుమ్రా చెప్పాడు. ‘రోహిత్, విరాట్‌ల రిటైర్మెంట్‌కు ముందే.. ఐపీఎల్ జరుగుతున్నప్పుడే నేను బీసీసీఐతో మాట్లాడా. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో నాపై ఉండే వర్క్‌లోడ్ గురించి వారితో చర్చించా. అలాగే నాకు చికిత్స చేస్తున్న వైద్యుల సలహాలు కూడా తీసుకున్నా. వాస్తవానికి బోర్డు నన్ను కెప్టెన్‌గా చేసేందుకు సిద్ధపడింది. కానీ నేను సిరీస్ మొత్తం ఆడలేను. అలాంటప్పుడు ఒకే సిరీస్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదు. అందుకే నేనే స్వయంగా ఫోన్ చేసి నాయకత్వ బాధ్యతలు వద్దని చెప్పా. నాకు కెప్టెన్సీ కన్నా క్రికెట్టే ఎక్కువ. ఓ ఆటగాడిగా మరింత సేవ చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని ఓ ఇంటర్వ్యూలో బుమ్రా వివరించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి