Share News

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:50 AM

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు...

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు

ముజ్‌ఫర్‌పూర్‌ (బిహార్‌): ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్‌ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అయాన్‌, వైభవ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ప్రాక్టీస్‌ కూడా చేసేవారు. ‘వైభవ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి బాటలోనే నేనూ నడుస్తున్నాన’ని అయాన్‌ చెప్పాడు. రాజ్‌ తండ్రి కూడా క్రికెటర్‌ కావడం విశేషం.

ఇవీ చదవండి:

గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:50 AM