Share News

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:29 AM

టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్లతో 190), కెప్టెన్‌ సకీబల్‌ గని (40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 128 నాటౌట్‌) వేగవంతమైన శతకాలు నమోదు చేయడంతో..

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది

బిహార్‌ 574/6

  • పురుషుల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు

  • గని, వైభవ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీలు

  • అరుణాచల్‌ చిత్తు

  • విజయ్‌ హజారే ట్రోఫీ

  • వైభవ్‌ సూర్యవంశీ (84 బంతుల్లో 190)

రాంచీ: టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్లతో 190), కెప్టెన్‌ సకీబల్‌ గని (40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 128 నాటౌట్‌) వేగవంతమైన శతకాలు నమోదు చేయడంతో.. విజయ్‌ హజారే ట్రోఫీలో బిహార్‌ ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. ప్లేట్‌ గ్రూప్‌లో బుధవారం అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బిహార్‌ 4 వికెట్లకు 574 స్కోరు చేసింది. పురుషుల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఇదే అత్యధికం. త్రుటిలో ద్విశతకం చేజార్చుకొన్న వైభవ్‌.. 36 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకోగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గని కేవలం 32 బంతుల్లోనే వంద పరుగుల మార్క్‌ చేరుకొన్నాడు. ఈ క్రమంలో లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన భారత బ్యాటర్‌గా సకీబల్‌ రికార్డులకెక్కాడు. కొండంత లక్ష్య ఛేదనలో అరుణాచల్‌ 42.1 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో బిహార్‌ 397 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇ‘షాన్‌దార్‌’

అహ్మదాబాద్‌: ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 125) లిస్ట్‌-ఎ క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసినా.. జార్ఖండ్‌ 5 వికెట్ల తేడాతో కర్ణాటక చేతిలో ఓడింది. తొలుత జార్ఖండ్‌ 412/9 స్కోరు చేసింది. ఛేదనలో కర్ణాటక 47.3 ఓవర్లలో 413/5 స్కోరు చేసి గెలిచింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (147) శతకం బాదాడు.

సకీబల్‌ గని

(40 బంతుల్లో 128 నాటౌట్‌)

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు

మెక్‌ గుర్క్‌ (ఆస్ట్రేలియా) 29 బంతులు

ఏబీ డివిల్లీర్స్‌ (దక్షిణాఫ్రికా) 31 బంతులు

సకీబల్‌ గని (భారత్‌) 32 బంతులు


లిస్ట్‌-ఎ క్రికెట్‌లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా వైభవ్‌ (14 ఏళ్ల 272 రోజులు)

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో భారత బ్యాటర్ల వేగవంతమైన శతకాలు

సకీబల్‌ గని 32 బంతులు అరుణాచల్‌పై డిసెంబరు 24, 2025

ఇషాన్‌ కిషన్‌ 33 బంతులు కర్ణాటకపై డిసెంబరు 24, 2025

అన్‌మోల్‌ ప్రీత్‌ 35 బంతులు అరుణాచల్‌పై డిసెంబరు 21, 2024

వైభవ్‌ సూర్యవంశీ 36 బంతులు అరుణాచల్‌పై డిసెంబరు 24, 2025

యూసుఫ్‌ పఠాన్‌ 40 బంతులు మహారాష్ట్రపై ఫిబ్రవరి 16, 2010

1

పురుషుల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో బిహార్‌ 574/6 అత్యధికం. 2023-24 సీజన్‌లో అరుణాచల్‌పై తమిళనాడు 506/2ను బిహార్‌ అధిగమించింది.

ఇవీ చదవండి:

మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Updated Date - Dec 25 , 2025 | 01:29 AM