T20 Cricket World Record: ఒకే ఒక్కడు 8 వికెట్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:47 AM
భూటాన్ లెఫ్టామ్ స్పిన్నర్ సోనమ్ యాషి టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా...
టీ20ల్లో భూటాన్ స్పిన్నర్ సోనమ్ వరల్డ్ రికార్డు (4-1-7-8)
న్యూఢిల్లీ: భూటాన్ లెఫ్టామ్ స్పిన్నర్ సోనమ్ యాషి టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా 22 ఏళ్ల సోనమ్ చరిత్రకెక్కాడు. భూటాన్‌లోని మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో మయన్మార్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సోనమ్ 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ ఉంది. అంతర్జాతీయ టీ20లు లేదా ఇతర టీ20 లీగ్‌లలో ఈ ఫీట్ నమోదవడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో.. గతంలో చైనాపై మలేసియా బౌలర్ సయజ్రుల్ ఇద్రుస్ (7/8) ఏడు వికెట్ల రికార్డును సోనమ్ బద్దలు కొట్టాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే, తొలుత భూటాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరు చేసింది. ఛేదనలో యువ స్పిన్నర్ సోనమ్ విజృంభణకు మయన్మార్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మరో నలుగురు డకౌటయ్యారు. దీంతో భూటాన్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?