Pro Kabaddi League: బుల్స్ బోణీ
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:54 AM
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల అనంతరం తొలి విజయాన్ని నమోదు చేసింది...
ప్రొ కబడ్డీ లీగ్‌లో పైరేట్స్ చిత్తు
విశాఖపట్నం-స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల అనంతరం తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38-30తో పట్నా పైరేట్స్‌ను చిత్తుచేసింది. బుల్స్ రైడర్ అలిరెజా మీర్జాయిన్ అద్భుతంగా రాణించి సూపర్ 10 సాధించగా.. మరో రైడర్ ఆశిష్ మాలిక్ 8 పాయింట్లు రాబట్టి బుల్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పైరేట్స్‌లో అయాన్ సూపర్ 10 సాధించినా ఫలితం లేకపోయింది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 37-28తో తమిళ్ తలైవా్‌సపై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..