Share News

Melbourne Pitch Controversy: మరెక్కడైనా అయితే ఎన్ని విమర్శలొచ్చేవో

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:59 AM

మెల్‌బోర్న్‌ పిచ్‌ పూర్తిగా బౌలర్లకు అనుకూలించడాన్ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ తప్పుబట్టాడు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలాంటి పిచ్‌ను రూపొందించి ఉంటే తీవ్ర విమర్శలు...

Melbourne Pitch Controversy: మరెక్కడైనా అయితే ఎన్ని విమర్శలొచ్చేవో

మెల్‌బోర్న్‌ పిచ్‌పై స్టోక్స్‌

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్‌ పిచ్‌ పూర్తిగా బౌలర్లకు అనుకూలించడాన్ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ తప్పుబట్టాడు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలాంటి పిచ్‌ను రూపొందించి ఉంటే తీవ్ర విమర్శలు చేసేవారన్నాడు. యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ తొలిరోజు 20 వికెట్లు నేలకూలిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌, భారత మాజీ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా స్టోక్స్‌ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘రెండ్రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడం సబబు కాదు. కానీ ఇలాంటి వికెట్‌ను ప్రపంచంలో మరెక్కడైనా తయారు చేస్తే దుమ్మెత్తి పోసేవారు’ అని మ్యాచ్‌ తర్వాత స్టోక్స్‌ కుండబద్దలు గొట్టాడు. ‘భారత్‌లో టెస్ట్‌ మొదటి రోజు ఇలానే వికెట్ల జాతర సాగితే ఎంత రాద్దాంతం చేసేవారో? ఇప్పుడు ఆస్ట్రేలియాను అలాగే తప్పుపడతారా’ అని కెవిన్‌ ప్రశ్నించాడు. ‘ఈ వికెట్‌ చాలా సాధారణంగా ఉంది. 4 యాషెస్‌ టెస్ట్‌లు రెండోరోజుల్లో ముగియడమా’ అని దినేశ్‌ ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్

Updated Date - Dec 28 , 2025 | 05:59 AM