Share News

BCCI Asia Cup boycott: భేటీ వేదిక మార్చకుంటే బాయ్‌కాట్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:35 AM

భారత ఉపఖండంలో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పిలుచుకునే ఆసియాకప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈనెల 24న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సమావేశం ఢాకాలో...

BCCI Asia Cup boycott: భేటీ వేదిక మార్చకుంటే బాయ్‌కాట్‌

ఆసియాక్‌పపై బీసీసీఐ ఆలోచన

న్యూఢిల్లీ: భారత ఉపఖండంలో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పిలుచుకునే ఆసియాకప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈనెల 24న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సమావేశం ఢాకాలో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో భారత్‌కు సత్సంబంధాలు లేని కారణంగా ఆ సమావేశం కోసం అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. అందుకే ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ ఆధ్వర్యంలో జరిగే ఆ సమావేశం వేదికను బంగ్లా నుంచి వేరే చోటుకు మార్చాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఒకవేళ భేటీ వేదికను మార్చపోతే ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియాక్‌పను బాయ్‌కాట్‌ చేస్తామని బీసీసీఐ హెచ్చరిస్తోంది. ఇప్పటికే లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలిపింది. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ‘ఢాకా నుంచి సమావేశం వేదికను మార్చితేనే ఆసియాకప్‌ జరుగుతుంది. నఖ్వీ భారత్‌పై అనవసర ఒత్తిడి తేవాలనుకుంటున్నాడు. వేదికను మార్చమని చెప్పినా ఇంత వరకు స్పందించలేదు. అయితే ఢాకాలోనే భేటీ జరిగితే అందులో తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా మేం పట్టించుకోం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 04:35 AM