BCCI Statement: గౌతీని మార్చే ఉద్దేశం లేదు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:39 AM
టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్‌ను తప్పించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించాడు. ‘గంభీర్ గురించి మీడియాలో వస్తున్న...
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
న్యూఢిల్లీ: టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్‌ను తప్పించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించాడు. ‘గంభీర్ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై నేను ఒకటి స్పష్టం చేయదల్చుకొన్నా. గౌతీని తప్పించడం కానీ.. మరో హెడ్ కోచ్‌ను తీసుకోవడం గానీ జరగదు. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడ’ని శుక్లా తెలిపాడు. భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ కావడంతో.. గౌతీ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్ట్ బాధ్యతలు అప్పజెప్పే దిశగా బీసీసీఐ సమాలోచన చేస్తోందన్న వార్తలు నెట్‌లో షికార్లు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?