Share News

ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లా మహిళా క్రికెటర్‌పై నిషేధం

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:39 AM

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లాదేశ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ షొహెలి అక్తర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. 36 ఏళ్ల షొహెలి బంగ్లా తరపున రెండు వన్డేలు, 13 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా...

ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లా మహిళా క్రికెటర్‌పై నిషేధం

దుబాయ్‌: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లాదేశ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ షొహెలి అక్తర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. 36 ఏళ్ల షొహెలి బంగ్లా తరపున రెండు వన్డేలు, 13 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా షొహెలి మ్యాచ్‌లను ఫిక్స్‌ చేసేందుకు ప్రయత్నించినట్టు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో తేలింది. ఆ టోర్నీలో తలపడ్డ బంగ్లా జట్టులో షొహెలి సభ్యురాలి కానప్పటికీ, మ్యాచ్‌లు ఫిక్స్‌ చేయాలంటూ సహచర క్రికెటర్‌కు ఆమె డబ్బు ఆశజూపింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో బంగ్లా మ్యాచ్‌కు ముందురోజు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సదరు క్రికెటర్‌ను సంప్రదించినట్టు విచారణలో షొహెలి అంగీకరించింది. ఈనెల 10 నుంచి షొహెలిపై నిషేధం అమల్లోకి వస్తుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా షొహెలి అక్తర్‌ అపఖ్యాతిని మూటగట్టుకుంది.


ఇవీ చదవండి:

రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి

సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2025 | 03:35 AM