Share News

Cricket News: బంగ్లా చేతిలో పాక్‌ చిత్తు

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:09 AM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్‌.. తొలి టీ20లో పర్యాటక పాకిస్థాన్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఓపెనర్‌ పర్వేజ్‌ హొస్సేన్‌ ఇమాన్‌ (56 నాటౌట్‌) అజేయ అర్ధ శకంతో...

Cricket News: బంగ్లా చేతిలో పాక్‌ చిత్తు

మిర్పూర్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్‌.. తొలి టీ20లో పర్యాటక పాకిస్థాన్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఓపెనర్‌ పర్వేజ్‌ హొస్సేన్‌ ఇమాన్‌ (56 నాటౌట్‌) అజేయ అర్ధ శకంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్లతో పాక్‌ను మట్టికరిపించింది. మొదట పాక్‌ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ (44), అబ్బాస్‌ అఫ్రీది (22), కుష్‌దిల్‌ షా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టస్కిన్‌ అహ్మద్‌ 3, ముస్తాఫిజుర్‌ 2 వికెట్లు తీశారు. ఛేదనలో బంగ్లా 15.3 ఓవర్లలో 112/3 స్కోరు చేసి గెలిచింది. తౌహిద్‌ హ్రిదయ్‌ (36) రాణించాడు. సల్మాన్‌ మీర్జా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 03:09 AM