రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:09 AM
కొన్ని నెలలుగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న రెజ్లర్లకు శుభవార్త. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన నిషేధాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. దీంతో జోర్డాన్‌లోని అమ్మాన్ వేదికగా జరగనున్న...

ఊపిరిపీల్చుకొన్న రెజ్లర్లు
న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న రెజ్లర్లకు శుభవార్త. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన నిషేధాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. దీంతో జోర్డాన్‌లోని అమ్మాన్ వేదికగా జరగనున్న ఆసియా చాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్ సహా సమాఖ్య తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది. ఈ ట్రయల్స్‌ను ఈనెల 15న నిర్వహించనున్నారు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడు అయిన సంజయ్ సింగ్ నియంత్రణలోకి సమాఖ్య వచ్చేసినట్టయింది. స్పోర్ట్స్ కోడ్ ఉల్లంఘన కారణంగా 2023, డిసెంబరు 24న సంజయ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ కార్యవర్గంపై క్రీడాశాఖ సస్పెన్షన్ విధించింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ హవాసాగే గోండాలోనే అండర్-15, అండర్-20 జాతీయ చాంపియన్‌షిప్స్‌ను ఏర్పాటు చేయాలనుకోవడం కూడా ప్రభుత్వాగ్రహానికి కారణమైంది. రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్టు క్రీడాశాఖ ప్రకటించింది. సమాఖ్య కార్యాలయాన్ని బ్రిజ్‌భూషణ్ ఇంటి నుంచి ఢిల్లీకి తరలించినట్టు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై అధ్యక్షుడు సంజయ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకొంటామన్నాడు. సమాఖ్యపై నిషేధం ఎత్తివేయకపోతే రెజ్లర్లకు అన్యాయం చేసినట్టేనని క్రీడామంత్రి మన్‌సుఖ్ మాండవ్య అన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో క్రుటదారులు మట్టికరిచారని బ్రిజ్‌భూషణ్ చెప్పాడు.
ఇవీ చదవండి:
అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి