Share News

Azhar Questions: మ్యాచ్‌ల ఎంపిక సరికాదు

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:04 AM

అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీ్‌సలో పేసర్‌ బుమ్రా అన్ని టెస్టులూ ఆడకపోవడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా తను కీలక మ్యాచ్‌లకు...

Azhar Questions: మ్యాచ్‌ల ఎంపిక సరికాదు

బుమ్రాపై అజర్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ: అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీ్‌సలో పేసర్‌ బుమ్రా అన్ని టెస్టులూ ఆడకపోవడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా తను కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ కూడా ఇదే విషయమై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘ఒక్కసారి జట్టులోకి వస్తే ఫలానా మ్యాచ్‌లే ఆడతానని ఎంపిక చేసుకోవడం కుదరదు. పని ఒత్తిడి అనేది ఉంటుంది. అయినా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఎవరికి వారే దీన్ని ఎదుర్కోవాలి. టెస్టు సిరీ్‌సలో పేసర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌, ఆకాశ్‌ రాణించడం జట్టు అదృష్టం. ఒకవేళ ఏదైనా క్లిష్ట సమయాల్లో బుమ్రా అవసరం ఏర్పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? గాయమైన సందర్భాల్లో మ్యాచ్‌కు దూరం కావడంపై బోర్డు, ఆటగాడు కలిసి నిర్ణయం తీసుకోవాలి’ అని అజర్‌ సూచించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 06:05 AM