Ayush Matre: అండర్ 19 వరల్డ్‌కప్ కెప్టెన్.. ఆయుష్ మాత్రే
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:02 AM
అండర్ 19 వరల్డ్‌కప్ కెప్టెన్.. ఆయుష్ మాత్రే
వైభవ్‌కు సౌతాఫ్రికా టూర్ పగ్గాలు
ముంబై: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వచ్చే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు నమీబియాలో ఈ జూనియర్ వరల్డ్‌కప్ జరగనుంది. అయితే, మెగా టోర్నీకి ముందు జరిగే అండర్-19 దక్షిణాఫ్రికా పర్యటనకు గాయపడిన మాత్రే, విహాన్ మల్హోత్రా దూరమయ్యారు. దీంతో జనవరి 3, 5, 7వ తేదీల్లో జరిగే సఫారీలతో మూడు వన్డేల సిరీ్‌సకు యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సారథ్యం వహించనున్నాడు.
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత అండర్-19 జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వంశ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, ఎనాన్, హనిల్ పటేల్, దీపేష్, కిషన్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోలి, రాహుల్.
అండర్-19 వరల్డ్‌కప్ జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్, అభిజ్ఞాన్, హర్వంశ్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, ఎనాన్, హనిల్ పటేల్, దీపేష్, కిషన్, ఉధవ్ మోహన్.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్