Australia Dominates South Africa: కింగ్ మ్యాజిక్
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:18 AM
డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా టాప్ లేపింది. వన్డే వరల్డ్ కప్ లీగ్ దశను అజేయంగా ముగించిన ఆసీస్ మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్పిన్నర్ అలనా కింగ్ (7/18) తిప్పేయడంతో.. శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో...
నేటి మ్యాచ్‌లు
ఇంగ్లండ్ X న్యూజిలాండ్
వేదిక: విశాఖపట్నం (ఉ.11నుంచి)
భారత్ X బంగ్లాదేశ్
వేదిక: నవీ ముంబై (మ.3 నుంచి)
స్టార్ నెట్‌వర్క్‌లో
సెమీఫైనల్లో ఎవరెవరంటే..
ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా (బుధవారం)
భారత్ X ఆస్ట్రేలియా (గురువారం)
7 వికెట్లతో విజృంభణ
టాప్ లేపిన ఆసీస్
దక్షిణాఫ్రికా చిత్తు
ఇండోర్: డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా టాప్ లేపింది. వన్డే వరల్డ్ కప్ లీగ్ దశను అజేయంగా ముగించిన ఆసీస్ మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్పిన్నర్ అలనా కింగ్ (7/18) తిప్పేయడంతో.. శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లారా వొల్వార్ట్ (31) టాప్ స్కోరర్. ఓపెనర్లు వొల్వార్ట్‌ను షుట్ అవుట్ చేయగా.. తన్జిమ్ బ్రిట్స్ (6)ను కిమ్ గార్త్ వెనక్కిపంపడంతో సఫారీల పతనం ఆరంభమైంది. వన్‌డౌన్ బ్యాటర్ సునె లుస్ (6) వికెట్‌తో వేటను మొదలెట్టిన కింగ్.. కాప్ (0), డెర్క్‌సెన్ (5), ట్రయాన్ (0), జెఫ్టా (29), క్లాస్ (4), డి క్లెర్క్ (14)ను అవుట్ చేసి సఫారీల వెన్నువిరిచింది. ఛేదనలో ఆసీస్ 16.5 ఓవర్లలో 98/3 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్ జార్జియా వోల్ (38 నాటౌట్), బెత్ మూనీ (42) మూడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు.
మహిళల వన్డే వరల్డ్‌కప్
అలనా కింగ్ (7/18)
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?