Asia Cup 2025 Ind Vs UAE: ఆసియా కప్ 2025.. యూఏఈతో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
ABN , Publish Date - Sep 10 , 2025 | 08:22 PM
ఆసియా కప్‌లో యూఏఈపై మ్యాచ్‌లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ప్రత్యర్థిని మట్టికరిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్ తొలి విజయం అందుకుంది. యూఏఈపై సునాయాసంగా నెగ్గింది. భారత్ టాస్ గెలవడంతో తొలుత బరిలోకి దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ 4.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన 60 పరుగులు చేసి సునాయాస విజయం అందుకుంది. తొమ్మిది వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. అభిషేక్ శర్మ 30 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.శుభమన్ గిల్ 20 పరుగులతో, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు (Asia Cup 2025 India Victory Over UAE).
ఆసియా కప్ టీ20 చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరును ఈ మ్యాచ్‌లో యూఏఈ నమోదు చేసింది. టీమ్‌కు కూడా ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. భారత బౌలింగ్‌ను తాళలేక యూఏఈ బ్యాటర్‌లు తొలి నుంచీ తడబడుతూనే ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. శివమ్ దూబే మూడు వికెట్లతో యూఏఈకి గట్టి షాకిచ్చాడు. కేవలం 31 బంతుల్లోనే భారత బౌలర్లు పది వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశారు. యూఏఈ బ్యాటర్‌లలో ఓపెనర్ అలీషాన్ షరాఫు 17 బంతుల్లో 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టీమ్‌ఇండియా జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
యూఏఈ జట్టు:
మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషన్ షరాఫు, మహ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హార్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, మహ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధీఖీ, సిమ్రన్‌జిత్ సింగ్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి