US Open Womens Singles Final: ఆఖరి పోరులో సబలెంక అమందా
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:00 AM
టాప్ సీడ్ అర్యాన సబలెంక, ఎనిమిదో సీడ్ అమంద అనిసిమోవ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక...
సెమీ్‌సలో ఒసాక, పెగుల ఓటమి
యూఎస్ ఓపెన్
న్యూయార్క్: టాప్ సీడ్ అర్యాన సబలెంక, ఎనిమిదో సీడ్ అమంద అనిసిమోవ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక (బెలారస్) 4-6, 6-4, 6-3తో నాలుగో సీడ్ పెగుల (అమెరికా)పై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో లోకల్ స్టార్ అనిసిమోవ 6-7 (4), 7-6 (3), 6-3తో ఫ్లషింగ్ మెడో్‌సలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన నవోమి ఒసాక (జపాన్)ను చిత్తు చేసింది. ఈసారి అనిసిమోవ జోరు అలా ఇలా లేదు. క్వార్టర్‌ఫైనల్లో ఆరు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్, టైటిల్ ఫేవరెట్ స్వియటెక్‌కు షాకిచ్చిన అమెరికా యువ క్రీడాకారిణి సెమీఫైనల్లో..నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నవోమి ఒసాకాకు ఝలకిచ్చింది. తద్వారా 24 ఏళ్ల అమందా వరుసగా రెండోసారి మేజర్ టోర్నీ తుదిపోరుకు చేరింది. వింబుల్డన్‌లోనూ అనిసిమోవ టైటిల్ ఫైట్‌కు చేరిన విషయం విదితమే. ముఖాముఖి పోరులో సబలెంకపై అనిసిమోవ 6-3తో ఆధిక్యంలో ఉండడం విశేషం. ఈ ఏడాది వింబుల్డన్ సెమీఫైనల్లో సబలెంకపై అమందాదే పైచేయి అయ్యింది. అనిసిమోవా-ఒసాక సెమీస్ తొలి రెండు సెట్లు నువ్వా..నేనా అనేలా సాగాయి. దాంతో రెండు సెట్లూ టేబ్రేకర్‌కు వెళ్లాయి. అయితే మొదటి సెట్‌ను ఒసాక సొంతం చేసుకోగా..రెండో సెట్‌ను అనిసిమోవ చేజిక్కించుకుంది. ఈనేపథ్యంలో నిర్ణాయక మూడో సెట్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశారు. కానీ కీలక తరుణంలో నవోమి చేతులెత్తేసింది. ఫలితంగా ఆఖరి సెట్‌ను అలవోకగా కైవసం చేసుకున్న అనిసిమోవ మ్యాచ్‌ను ముగించేసింది. ఒసాక 15 ఏస్‌లతో విరుచుకుపడగా..అమందా 50 విన్నర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇక..పెగులకు మరోసారి ఫ్లషింగ్ మెడో్‌సలో నిరాశ తప్పలేదు. గత సంవత్సరం ఫైనల్లోనూ పెగులపై సబలెంక విజయం సాధించడం గమనార్హం. ఈసారి సెమీ్‌సలో సబలెంక ఎనిమిది ఏస్‌లు వేస్తే..పెగుల మూడింటికే పరిమితమైంది. ఇద్దరూ చెరో నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేయగా..43 విన్నర్లతో ప్రత్యర్థిని సబలెంక ఉక్కిరిబిక్కిరి చేసింది.
భాంబ్రి జోడీ ఓటమి
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ్‌సకు చేరడం ద్వారా టైటిల్‌పై ఆశలు రేపిన భారత డబుల్స్ ఆటగాడు యుకీ భాంబ్రి ఫైనల్ మాత్రం చేరలేక పోయాడు. ఉత్కంఠ భరితంగా సాగిన పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో భాంబ్రి/మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 7-6 (2), 6-7 (5), 4-6తో కుప్‌స్కీ/శాలి్‌సబరీ ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..