టీ20 ఉత్తమ క్రికెటర్‌గా అర్ష్‌దీప్
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:47 AM
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యాడు. 2024 ఏడాదికిగాను ఐసీసీ ఈ అవార్డులను ప్రకటించింది. ఇందుకోసం సికిందర్ రజా, బాబర్ ఆజమ్, ట్రావిస్ హెడ్ కూడా...
ఐసీసీ టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్
దుబాయ్: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యాడు. 2024 ఏడాదికిగాను ఐసీసీ ఈ అవార్డులను ప్రకటించింది. ఇందుకోసం సికిందర్ రజా, బాబర్ ఆజమ్, ట్రావిస్ హెడ్ కూడా పోటీపడ్డారు. గతేడాది అర్ష్‌దీప్ ఆడిన 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు. ఐసీసీ పురుషుల టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. తన సారథ్యంలో గతేడాది భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే ఈ జట్టులో భారత్ నుంచి పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ కూడా చోటు దక్కించుకున్నారు.
మహిళల టీ20 జట్టులో మంధాన, రిచా, దీప్తి: 2024 ఐసీసీ మహిళల టీ20 జట్టులో భారత్ నుంచి స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, కీపర్ రిచా ఘోష్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్డ్‌ను కెప్టెన్‌గా నియమించారు.
ఇవీ చదవండి:
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి