Arjun Tendulkar Engagement: పెళ్లి పీటలెక్కనున్న అర్జున్
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:11 AM
దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. స్థానిక పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో..
ముంబై: దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. స్థానిక పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ (25)కు ఈనెల 11న నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని సానియా స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. అయితే ఈ విషయమై ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. మరోవైపు ఈ సానియా గురించి అభిమానులు నెట్టింట తెగ శోధిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న తను పెంపుడు జంతువుల కోసం ముంబైలో స్పా అండ్ స్టోర్‌ను నిర్వహిస్తోంది. అలాగే ప్రపం చ ప్రఖ్యాత బాస్కిన్-రాబిన్స్ ఐస్‌క్రీమ్‌కు సంబంధించి భారత్‌లో వ్యవహారాలను వీరి కుటుంబానికి చెందిన గ్రావిస్ గ్రూప్ చూస్తోంది. ఇంకా బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌క్రీమ్‌తో పాటు ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ కూడా వీరి సొంతమే. రియల్ ఎస్టేట్‌లోనూ రవి ఘాయ్‌కు చెందిన గ్రూప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News