Share News

Freestyle Chess Slam: బరిలో అర్జున్‌ ప్రజ్ఞానంద

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:18 AM

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి, తమిళ స్టార్‌ ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి.. బుధవారం నుంచి జరిగే లాస్‌ వెగాస్‌ ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో...

Freestyle Chess Slam: బరిలో అర్జున్‌ ప్రజ్ఞానంద

ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ నేటినుంచి

లాస్‌ వెగాస్‌ (యూఎ్‌సఏ): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి, తమిళ స్టార్‌ ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి.. బుధవారం నుంచి జరిగే లాస్‌ వెగాస్‌ ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో పోటీపడుతున్నారు. ఈ మెగా టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ ఆడడం లేదు. టోర్నీలో మొత్తం 16 మంది క్రీడాకారులు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నారు. వైట్‌ గ్రూప్‌లో కార్ల్‌సన్‌, ప్రజ్ఞానంద ఉండగా, బ్లాక్‌ గ్రూప్‌ నుంచి అర్జున్‌, విదిత్‌ బరిలో ఉన్నారు. ప్రతి గ్రూప్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు క్వార్టర్స్‌కు చేరతారు. ఈనెల 21న ఫైనల్‌ జరగనుంది. టోర్నీ విజేతకు రూ. 1.71 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కనుంది.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:18 AM