FIDE World Rapid Chess Championship: అగ్రస్థానంలో అర్జున్
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:40 AM
ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌ప శుక్రవారం, తొలిరోజు ఐదు రౌండ్లు ముగిసేసరికి భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి (4.5) అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి నాలుగు గేమ్‌లు గెలిచిన అర్జున్...
వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షి్‌ప
దోహా: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌ప శుక్రవారం, తొలిరోజు ఐదు రౌండ్లు ముగిసేసరికి భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి (4.5) అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి నాలుగు గేమ్‌లు గెలిచిన అర్జున్.. ఐదో రౌండ్‌లో వరల్డ్ నెం.1 కార్ల్‌సన్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో కార్ల్‌సన్ (4.5)తో కలిసి కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో 4 రౌండ్లు ముగిసేసరికి హారిక (3.5) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. నాలుగు గేమ్‌లలో మూడు నెగ్గిన హారిక ఒక మ్యాచ్‌ను డ్రా చేసింది. ఇక.. నాలుగు గేమ్‌లలో రెండు గెలిచిన హంపి, మరో రెండింటిని డ్రా చేసుకుంది. 3 పాయింట్లతో హంపి సంయుక్తంగా మూడోస్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..