Arjun Award Nominations: ‘అర్జున’కు గాయత్రి, ధనుష్
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:07 AM
జాతీయ క్రీడా అవార్డులకు ఆటగాళ్ల పేర్లను ఎంపిక కమిటీ సిఫారసు చేసింది. బుధవారం విడుదలజేసిన 24 మంది ఆటగాళ్ల జాబితాలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి, జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్...
ఖేల్‌రత్నకు హార్దిక్ సింగ్
సిఫారసు చేసిన కమిటీ
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా అవార్డులకు ఆటగాళ్ల పేర్లను ఎంపిక కమిటీ సిఫారసు చేసింది. బుధవారం విడుదలజేసిన 24 మంది ఆటగాళ్ల జాబితాలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి, జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి పేరును అర్జున పురస్కారానికి సిఫారసు చేసింది. గాయత్రి డబుల్స్ సహచరి ట్రీసా జాలీ (కేరళ) పేరునూ ఎంపిక చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి అపర్ణా పొపట్, హాకీ మాజీ క్రీడాకారిణి ఎం ఎం సౌమ్యలతో కూడిన ఎంపిక కమిటీ..ప్రతిష్ఠాత్మక ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు హాకీ జట్టు వైస్-కెప్టెన్ హార్దిక్ సింగ్ పేరును ప్రతిపాదించింది. మొత్తం 24 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు సిఫారసు చేసింది.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ