Share News

Sachin Anderson Statement: నాకు దక్కిన గొప్ప గౌరవం

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:26 AM

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీగా పిలుచుకుంటున్నారు. అయితే దిగ్గజ సచిన్‌ పేరు పక్కన తన పేరు చూసి...

Sachin Anderson Statement: నాకు దక్కిన గొప్ప గౌరవం

లండన్‌: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీగా పిలుచుకుంటున్నారు. అయితే దిగ్గజ సచిన్‌ పేరు పక్కన తన పేరు చూసి గర్వంగా భావించినట్టు అండర్సన్‌ తెలిపాడు. ‘క్రికెట్‌లో సచిన్‌ ఓ దిగ్గజ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌తో కలిసి ట్రోఫీని పంచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నిజానికి నేను అతడితో సరితూగగలనా? అని కూడా మనసులో అనుకున్నా. కానీ మన పేరుతో ట్రోఫీని నిర్వహించడమే చాలా గొప్ప విషయం. అది కూడా సచిన్‌ సరసన నాకు స్థానం దక్కడం ఎనలేని సంతోషాన్నిచ్చింది. చిన్నప్పటి నుంచి అతడి ఆటను చూసి పెరిగాను. ప్రత్యర్థిగానూ ఆడా’ అని అండర్సన్‌ వివరించాడు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 03:26 AM