Indian Shooters: అనంత్ గోల్డెన్ షూట్
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:55 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో భారత తొలి స్వర్ణం దక్కించుకుంది. పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరూక అగ్రస్థానంలో నిలిచాడు. ఇక..పిస్టల్ విభాగంలో భారత్ మరో కాంస్యం సాధించింది. బుధవారం ఉత్కంఠ...
సౌరభ్ జోడీకి కాంస్యం
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప
షిమ్‌కెంట్ (కజకిస్థాన్) : ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో భారత తొలి స్వర్ణం దక్కించుకుంది. పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరూక అగ్రస్థానంలో నిలిచాడు. ఇక..పిస్టల్ విభాగంలో భారత్ మరో కాంస్యం సాధించింది. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన పురుషుల స్కీట్ ఫైనల్లో అనంత్‌జీత్ 57-56 స్కోరుతో ఆసియా క్రీడల మాజీ చాంపియన్ మన్సూర్ అల్ రషీది (కువైట్)ని ఓడించి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అలీ అహ్మద్ (ఖతార్) కాంస్యం అందుకున్నాడు. ఇక పిస్టల్ కేటగిరీలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సౌరభ్ చౌధరి/సురుచి ఇందర్ సింగ్ ద్వయం కాంస్యం సొంతం చేసుకుంది. కాంస్య పోరులో భారత జంట 17-9 స్కోరుతో తైపీ జోడీ లియు హెంగ్/సియాంగ్ చెన్‌పై గెలుపొందింది. చైనా స్వర్ణం, దక్షిణ కొరియా రజతం అందుకున్నాయి. జూనియర్ పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో భారత్‌కు చెందిన వనిష్క చౌధరి/గవిన్ ఆంథోనీ జంట 16-14 స్కోరుతో కొరియా ద్వయం కిమ్ యేజిన్/కిమ్ డూయోన్‌ని ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..