గంట వర్షానికే అస్తవ్యస్తం!
ABN , Publish Date - Mar 02 , 2025 | 02:25 AM
29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. టోర్నీలో...

పీసీబీ తీరుపై విమర్శలు
లాహోర్: 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. టోర్నీలో భాగంగా వరుసగా మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వరుణుడు తెరిపినిచ్చినా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆట వీలుపడడం లేదు. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాలను కోట్ల ఖర్చుతో మరమ్మతులు చేయించారు. అయినా కొద్ది వర్షానికే అవుట్‌ఫీల్డ్ మొత్తం నీటితో నిండడం, మైదానాన్ని కప్పి ఉంచేందుకు కవర్లు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శుక్రవారం ఆస్ట్రేలియా- అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌లో గంట పాటే వర్షం కురిసినా స్టేడియాన్ని సిద్ధం చేయలేకపోయారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడం పీసీబీ మర్చిపోయినట్టుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నీటిని తోడేందుకు కొందరు సిబ్బంది వంటగదుల్లో వాడే మాపింగ్ కర్రలను ఉపయోగించడం, స్పాంజిలను నీళ్లలో ముంచి తీయడంలాంటి దృశ్యాలు కనిపించాయి.
టిక్కెట్ల సొమ్ము వాపస్: రావల్పిండిలో గత నెల 25, 27న జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు వర్షంతో టాస్ పడకుండానే రద్దయ్యాయి. దీంతో ఆ మ్యాచ్‌లను తిలకించేందుకు తరలివచ్చిన ప్రేక్షకులకు పూర్తి టిక్కెట్ సొమ్మును వెనక్కి ఇవ్వనున్నట్టు పీసీబీ ప్రకటించింది.
ఇవీ చదవండి:
ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి